Thursday, April 11, 2019

Rani Lakshmibai

Rani Lakshmibai


భారతదేశ చరిత్రలో సుప్రసిద్ధ మహిళా యోధురాలిగా ఖ్యాతిచెందిన లక్ష్మీబాయి ఝాన్సీ రాజ్యానికి రాణిగా వ్యవహరించింది. నవంబరు 19, 1828న జన్మించిన లక్ష్మీబాయి అసలుపేరు మణికర్ణిక. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో లక్ష్మీబాయి బ్రిటీష్ వారిని ఎదిరించిన ప్రముఖులలో ఈమె ఒకటిగా నిల్చింది. బ్రిటీష్ వారితో పోరాడుతూ జూన్ 17, 1858న యుద్ధరంగంలోనే ప్రాణాలు కోల్పోయింది.

బాల్యం:

నవంబరు 19, 1828న వారణాసిలో మరాఠా బ్రహ్మణ కుటుంబంలో జన్మించిన మణికర్ణికకు చిన్నవయస్సులోనే ఝాన్సీకి చెందిన పాలకుడు గంగాధరరావుతో వివాహమైంది. దీనితో ఆమె పేరు కూడా లక్ష్మీబాయిగా మారింది. వీరికి 1951లో ఒక కుమారుడు జన్మించిననూ చిన్న వయస్సులోనే మరణించాడు. ఆనందరావు అనే బాలుడిని దత్తత తీసుకున్నారు. 1853లో భర్త గంగాధరరావు కూడా మరణించాడు.

బ్రిటీష్ వారిపై పోరాటం:

భర్త మరణానంతరం దత్తత కుమారుడు ఆనందరావు రాజు కావలసి ఉన్ననూ అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం చేసిన రాజ్యసంక్రమణ సిద్ధాంతం దీన్ని అడ్డుకుంది. గంగాధరరావు చెల్లించవలసిన రుణాన్ని కూడా లక్ష్మీబాయి పెన్షన్ నుంచి తగ్గించారు. లక్ష్మీబాయిని ఝాన్సీ విడిచివెళ్ళవలసిందిగా బ్రిటీష్ ప్రభుత్వం ఆదేశించింది. దీనితో లక్ష్మీబాయి బ్రిటీష్ వారిపై పగబట్టింది. స్వంతంగా చేత కట్టిపట్టి ఒక సైన్యాన్ని తయారుచేసుకుంది. 1857 మే 10న సిపాయిల తిరుగుబాటు లక్ష్మీబాయి పోరాటానికి కలసివచ్చింది. ఝాన్సీ, బుందేల్‌ఖండ్ ప్రాంతంలో లక్ష్మీబాయి ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించి బ్రిటీష్ వారిని ఎదిరించింది. 1858లో బ్రిటీష్ వారు ఝాన్సీని ఆక్రమించిననూ లక్ష్మీబాయి పురుష వేషంలో వారి కన్నుగప్పి పారిపోయి ప్రముఖ విప్లవకారుడు తాంతియాతోపేను కలిసింది. గ్వాలియర్‌తో యుద్ధం చేస్తున్న సమయంలోనే జూన్ 17, 1858న లక్ష్మీబాయి వీరమరణం పొందింది.

No comments:

Post a Comment

Rani Lakshmibai

Rani Lakshmibai భారతదేశ చరిత్రలో సుప్రసిద్ధ మహిళా యోధురాలిగా ఖ్యాతిచెందిన లక్ష్మీబాయి ఝాన్సీ రాజ్యానికి రాణిగా వ్యవహరించింది. నవంబరు 19,...